
సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టెనెంట్’. మేఘా చౌదరి హీరోయిన్. వై.యుగంధర్ దర్శకత్వంలో మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేస్తూ సోమవారం గ్లింప్స్‌ను విడుదల చేశారు. చందన పయావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, అడుకాలం నరేష్, ఎస్తేర్ నోర్హా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు రివీల్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘జీవితం ఆడే వైకుంఠపాళిలో ఎంచుకున్న పాచికల్లాంటి ఆరు ముఖ్యపాత్రల మధ్య జరిగే కథ ఇది. ప్రస్తుత అర్బన్ లైఫ్ స్టయిల్‌ని ప్రతిబింబిస్తూ మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతూ, వాళ్లని అలెర్ట్ చేసే విధంగా ఉంటుంది’ అని చెప్పాడు. సాహిత్య సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.