గుడ్డు @ రూ. 5.85... స్కూల్స్, కేజీబీవీ, హాస్టల్స్, గురుకులాల్లో సరఫరాకు టెండర్లు

గుడ్డు @ రూ. 5.85... స్కూల్స్, కేజీబీవీ, హాస్టల్స్, గురుకులాల్లో సరఫరాకు టెండర్లు
  • రాష్ట్రవ్యాప్తంగా యాదాద్రి జిల్లాలోనే తక్కువ ధర కోట్
  • ఆ తర్వాత స్థానంలో ఖమ్మం 
  • ఎక్కువ రేటు గద్వాల, నారాయణపేట
  • స్కూల్స్, కేజీబీవీ, హాస్టల్స్, గురుకులాల్లో సరఫరాకు టెండర్లు 

యాదాద్రి, వెలుగు :  అంగన్‌వాడీ సెంటర్లు, గురుకులాలు, హాస్టల్స్​, కేజీబీవీలకు ప్రభుత్వం పంపిణీ చేసే కోడిగుడ్లకు సంబంధించిన టెండర్లలో యాదాద్రి జిల్లాలో తక్కువ రేట్​కు కాంట్రాక్టర్​బిడ్​దాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ నిర్వహించిన టెండర్లలో ఇదే తక్కువ రేటుగా నిలిచింది. ఖమ్మం తప్ప మిగతా జిల్లాలతో పోలిస్తే తక్కువకే కోట్​చేశారు. 

కొత్త జిల్లాల వారీగా ఒకే టెండర్..

గతంలో వేర్వేరు విధానాల్లో కాంట్రాక్టర్లు గుడ్లను సప్లయ్​చేసేవారు. ఈ విధానానికి స్వస్తి చెప్పిన సర్కారు.. ఆయా విద్యా సంస్థలకు ఒకే కాంట్రాక్టర్, ఒకే విధమైన రేటుతో సప్లయ్​చేసేలా నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొత్త జిల్లాల వారీగా వేర్వేరుగా కోడిగుడ్ల సరఫరాకు టెండర్లు పిలిచారు.  ఒక్కో గుడ్డు 45 గ్రాముల నుంచి 50 గ్రాముల సైజులో సప్లయ్​చేయాలని టెండర్​లో పేర్కొన్నారు. 

ఎవరు తక్కువ కోట్​ చేస్తే వారికే..

రూల్స్​ మేరకు టెండర్లలో ఎవరు తక్కువ రేటుకు సప్లయ్​చేస్తారో వారికే దక్కుతుంది. ఈవిధంగా ఇప్పటివరకూ 21 జిల్లాల్లో కోడి గుడ్ల టెండర్​ ప్రక్రియ ముగిసినట్టుగా తెలుస్తోంది. కోడి గుడ్ల సరఫరాకు బిడ్​దాఖలు చేసిన కాంట్రాక్టర్లు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా రేటును పేర్కొన్నారు. వీరిలో తక్కువ రేటు కోట్​చేసిన వారు కోడి గుడ్ల సప్లయ్​కాంట్రాక్ట్​దక్కించుకున్నారు. 

యాదాద్రిలో గుడ్డు రూ. 5.85..

తాజాగా ఈ ప్రక్రియ యాదాద్రి జిల్లాలో ముగిసింది. అన్ని జిల్లాల్లో పోలిస్తే యాదాద్రిలో కోట్​చేసిన రేటు తక్కువగా ఉంది. జిల్లాలో ఐదుగురు కాంట్రాక్టర్లు రూ. 7 లక్షల చొప్పున ఈఎండీ చెల్లించి టెండర్లు దాఖలు చేశారు. అయితే వీరిలో ఓ కాంట్రాక్టర్​రూల్స్​మేరకు అవసరమైన డాక్యూమెంట్​ దాఖలు చేయకపోవడంతో తిరస్కరించారు. 

మిగిలిన నలుగురిలో ఇద్దరు ఒక్కో గుడ్డుకు రూ. 6.42 కోట్​చేశారు. మరో వ్యక్తి రూ.6.36 కోట్​చేశారు. అయితే ఒక్కో గుడ్డును రూ. 5.85 చొప్పున సప్లయ్​ చేయడానికి ఖమ్మం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ కోట్​చేసి టెండర్​దక్కించుకున్నారు. ఈ రేటుకే జిల్లాలోని 62, 400 మంది స్టూడెంట్స్​కు 1,63,18,000 గుడ్లు సప్లయ్​చేయాల్సి ఉంటుంది.