
- 6 ప్యాకేజీలుగా విభజన
- ఆగస్ట్12 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 20 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ (వైఐఐఆర్‌ఎస్) నిర్మాణానికి టీజీఈడబ్ల్యూఐడీసీ టెండర్లు ఆహ్వానించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, నల్గొండ జిల్లాలో కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ , భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల, నారాయణపేట, మహబూబ్ నగర్, మక్తల్, దేవరకద్రలు లిస్టులో ఉన్నాయి.
ఆరు ప్యాకేజీలుగా టెండర్లను విభజించారు. బుధవారం (జులై 02) నుంచి ఈ నెల18 వరకు ఒక్కో ప్యాకేజీకి టెండర్లు స్టార్ట్ కానున్నాయి. వచ్చే నెల 12 వరకు వివిధ దశలుగా నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీలకు అనుగుణంగా టెండర్లు దాఖలు చేయాలని టీజీఈడబ్ల్యూఐడీసీ సూచించింది. వచ్చే నెల 12 వరకు టెండర్ దాఖలుకు గడువు విధించగా.. అదే నెల18 వరకు ఫైనాన్సియల్ బిడ్స్ ఓపెన్ చేయనున్నారు. వీటితో పాటు కోఠిలో చాకలి ఐలమ్మ మహిళ వర్సిటీలో కూడా పలు నిర్మాణాలకు కార్పోరేషన్ టెండర్లు పిలిచింది.