అంతర్వేదిలో కొనసాగుతున్న ఉద్రిక్తత

అంతర్వేదిలో కొనసాగుతున్న ఉద్రిక్తత

భారీగా మొహరించిన పోలీసు బలగాలు

బీజేపీ, జనసేన నాయకుల గృహ నిర్బంధం.. ఎక్కడికక్కడ అరెస్టులు  

అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం మొన్న అర్ధరాత్రి దగ్ధమైన నేపథ్యంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇవాళ చలో అంతర్వేదికి భాజపా, జనసేన పిలుపునిచ్చాయి. దీంతో కోనసీమ వ్యాప్తంగా భాజపా, జనసేన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధం చేశారు. ముఖ్య నాయకులను అరెస్టు చేశారు. 30 పోలీసు యాక్టు అమలు కారణంగా అంతర్వేదిలో పర్యటించేందుకు నాయకులకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. కొత్తపేటలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. సహా పార్టీలోని ముఖ్య నాయకులు..  కార్యవర్గ సభ్యుడు పాలూరు సత్యానందం, రావులపాలెంలో భాజపా గుంటూరుజిల్లా పదాధిపతి రామకృష్ణారెడ్డి తదితరులను గృహనిర్బంధం చేశారు. నిన్న చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొన్న 43 మంది నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా అంతర్వేదిలో పోలీసులు భారీగా మోహరించారు. ఇతర ప్రాంతాల వారు అంతర్వేదిలో అడుగుపెట్టకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.