
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. బంగారుపాళ్యం సమీపంలో జగన్ రోడ్ షో నిర్వహించగా.. వైసీపీ నేత, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరులు వీరంగం సృష్టించారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులని నరికేస్తాం, చంపేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరులు.
పోలీసుల చేతులు నరకండి.. రపా రపా నరికేస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరులు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు నరికేస్తాం, చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మాజీ ఎమ్మెల్యే ఎదుటే ఆయన అనుచరులు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డ వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డ్యూటీ చేస్తోన్న పోలీసులను చంపేస్తామని బెదిరించడమేంటని ప్రశ్నిస్తున్నారు.