వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఓ కాంట్రాక్టర్ అన్న షర్మిల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన షర్మిల ప్లెక్సీలను చించేశారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్టీపీ కార్యకర్తల ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,  వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ లపై  వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆరూరి రమేశ్ పేరుకే ఎమ్మెల్యే కానీ కానీ ఆయన చేసేవి సివిల్ కాంట్రాక్ట్ పనులని వ్యాఖ్యానించారు. అడుగడుగునా భూ కబ్జాలు చేస్తున్నాడని.. చివరికి గుట్టలు కూడా మాయం చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే అరాచకాలు భరించలేక వర్దన్నపేటలో  సొంత పార్టీ కౌన్సిలర్లు ఎదురు తిరిగారని ధ్వజమెత్తారు.