రవీందర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత : MLA గో బ్యాక్ అంటూ నినాదాలు

రవీందర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత : MLA గో బ్యాక్ అంటూ నినాదాలు

ఆత్మకూరు: గుండె పోటుతో మరణించిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ డెడ్ బాడీని వరంగల్ జిల్లా ఆత్మకూరులోని ఆయన సొంత ఇంటికి తరలించారు. రవీందర్ ఇంటికి కార్మికులంతా చేరుకోవాలని జేఏసీ పిలుపునివ్వడంతో.. ఆత్మకూరులో భారీగా పోలీసులు మోహరించారు. రవీందర్ ఇంటిదగ్గర పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. రవీందర్ ఇంటి దగ్గరకు చేరుకున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ఛేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ ఆర్టీసీ కార్మికులు నినాదాలే చేశారు. కార్మికుల గురించి ఎమ్మెల్యే ఎప్పుడూ మాట్లాడలేదని ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత రవీందర్ ఫ్యామిలీని పరామర్శించిన ఎమ్మెల్యే వారిని ఆదుకుంటానని తెలిపారు.

సమ్మె నేపథ్యంలో ఎదురైన విపరీత ఒత్తిడులతో రవీందర్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయన్ని హైదరాబాద్ లోని మెడికవర్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి తర్వాత కన్నుమూశారు. రవీందర్ చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబసభ్యలు. రవీందర్ మృతదేహానికి నివాళులర్పించడానికి జేఏసీ నేతలు వస్తున్నారు. ఆయన ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది.