
హైదరాబాద్ లోని కట్టెల మండిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమకు కేటాయించిన ఇండ్లను ఎందుకు ఇవ్వటం లేదని ఆందోళన చేశారు మహిళలు. అక్కడికి వచ్చిన తహశీల్ధార్ కాళ్లు మొక్కారు దళిత మహిళలు. దీంతో పోలీసులను పెట్టి స్థానికులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అధికారులు. పోలీసులకు ఆదేశాలు ఇచ్చి తహశీల్ధార్ వెళ్లిపోతుంటే.. స్థానికులు, మహిళలు అడ్డుకున్నారు. ఇండ్లు కేటాయించి ... ఇవ్వడం లేదని బోరున విలపించారు మహిళలు. కొన్ని రోజుల క్రితం లబ్ధిదారులు ఇండ్ల తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. ఇపుడు రెవెన్యూ అధికారులు వారిని బలవంతంగా ఖాళీ చేస్తున్నారు.