బీఆర్ఎస్లో నల్గొండ అర్బన్ టెన్షన్

బీఆర్ఎస్లో నల్గొండ అర్బన్ టెన్షన్
  •     పట్టణ ఓటర్ల తీర్పు పై  ఎమ్మెల్యేల్లో ఆందోళన
  •     2018 లో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్
  •     ఎంపీ ఎన్నికల్లో సీన్​రివర్స్​.. 
  •     ప్రస్తుతం కాంగ్రెస్​లో చేరికలన్నీ పట్టణ ప్రాంతాల్లోనే అధికం 
  •     పెద్ద మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్​కు ఓట్ల గండం 

నల్గొండ, వెలుగు  : ఉమ్మడి జిల్లా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల్లో అర్బన్​ ఓటర్ల టెన్షన్​ పట్టుకుంది.  2018 ఎన్నికల్లో తొమ్మిది చోట్ల ఆపార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందగా, మూడు చోట్ల ఓడిపోయారు.  ఆతర్వాత  జరిగిన పార్లమెంట్​ ఎన్ని కల్లో బీఆర్​ఎస్​ ఘోరంగా దెబ్బతిన్నది. నల్గొండ, భువనగిరి పార్లమెంట్​ స్థానాల్లో కాంగ్రెస్​ గెలిచింది. భువనగిరి సిట్టింగ్​ స్థానాన్ని కూడా బీఆ ర్​ఎస్ కోల్పోవడంతో పార్టీకి గట్టిషాక్ తగిలింది. అనంతరం  మున్సిపల్​ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మున్సిపల్​  ఎన్నికల్లో బీఆర్​ఎస్​  బలం సరిపోక, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సపోర్ట్​తో గట్టెక్కాల్సి వచ్చింది. నల్గొండ, దేవర కొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ లాంటి పెద్ద మున్సిపాలిటీ ల్లో బీఆర్​ఎస్​ ఓటమి అంచుల వరకు వెళ్లింది.   

కొత్తగా ఏర్పడ్డ చిట్యా ల, నేరేడుచర్ల లాంటి మున్సిపాలిటీల్లో అయితే కాంగ్రెస్​ కౌన్సిలర్ల మద్దతుతో గట్టెక్కారు.  ఉమ్మడి జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఉండగా ..  నల్గొండ, దేవరకొండ, మి ర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడలో లక్షకుపైగా ఓటర్లు ఉన్నారు.   ఇటీవల బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి వలసొచ్చిన నేతల్లో పట్టణ ప్రాంతాల  లీడర్లే ఎక్కువ మంది ఉన్నారు. దేవరకొండ, హుజూర్​నగర్, చౌటుప్పుల్, చిట్యాల మున్సిపల్​ చైర్మన్​లతో సహా, మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చే రితే, నల్గొండలో వైస్​ చైర్మన్​తో సహా 10 మంది కౌన్సిలర్లు పార్టీ మారా రు. దీంతో పట్టణ ఓటర్ల ఎటు వైపు మొగ్గుచూపుతారనే దాని పైన ఎమ్మె ల్యేలు ఆందోళన చెందుతున్నారు.

అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్న ఎమ్మెల్యేలు...

రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ సర్కార్​ పట్టణ ప్రాంతాల అభివృద్ధి పైనే ఫోకస్​ పెట్టింది.  నిన్నటి వరకు తమ వెంటే ఉ న్న ముఖ్యమైన లీడర్లు కాంగ్రెస్​లో చేరడంతో టెన్షన్​ పడుతున్నారు. చేరి కల వ్యవహారాన్ని లైట్​గా తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అభివృద్ధి మంత్రా న్నే జపిస్తున్నారు. గత రెండేళ్లలో సాధించిన ప్రగతి గురించి గొప్పులు చె ప్పుకుంటున్నారు. కానీ అభివృద్ధి పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మధ్యలోనే ఆగిపోయాయి.  నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో పనులు అన్నీ పెండింగ్​లోనే ఉన్నాయి. 20‌‌‌‌లో నల్గొండ పట్టణాన్ని దత్తత తీసు కున్న సీఎం కేసీఆర్​ పట్టణాభివృద్ధికి రూ.1350 కోట్లు శాంక్షన్​ చేస్తే దాంట్లో ఇప్పటి వరకు కేవలం రూ.200 కోట్ల పనులు మాత్రమే  కంప్లీట్​ చేశామని అధికారులు చెపుతున్నారు. 

అది కూడా ఐటీ హబ్​, క్లాక్​ టవర్​ నుంచి మర్రిగూడ బైపాస్​ వరకు నిర్మించిన రోడ్డు తప్పా మిగిలిన పనులన్నీ ఫండ్స్​ లేక మధ్యలోనే ఆపేశారు. నకిరేకల్​​లో   ఓటర్లను ఆకట్టుకునేందుకు మెయిన్​ రోడ్డును ఇరువైపుల తవ్వివదిలేశా రు. ఫండ్స్​లేక  కేసీఆర్​, కేటీఆర్​, హారీష్​రావు ఇచ్చిన హామీలన్నీ పడకే శాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కొత్తగా ప్రారంభించిన కలెక్టరేట్​, మెడికల్​ కాలేజీ, ఎస్పీ ఆఫీసు, మినీ ట్యాంకు బండ్​ వంటి పనులు పైన మంత్రి జగదీష్​ రెడ్డి నమ్మకం పెట్టుకున్నారు. గోదావరి జలాలను సూర్యా పేట జిల్లాకు తీసుకరావడంతో రూరల్​ ఓటు బ్యాంకు కూడా తమకు కలి స్తొందని భావిస్తున్నారు. కానీ మున్సిపల్​ పాలకవర్గం పైన వ్యతిరేకత ఏం చేస్తోందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  

చిన్న మున్సిపాలిటీల్లోనే అదేతీరు...

హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు శాంక్షన్​ చేసిన సీ ఎం కేసీఆర్​..పనులు మాత్రం పెండింగ్​లో పెట్టారు. 2021లో ఉప ఎన్నిక లప్పుడు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేరకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సొంత పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాల వల్ల అభివృద్ధి పనులు ముందుకు సాగలేదనే విమర్శలు ఉన్నాయి. నేరు గా మంత్రి కేటీఆర్​ రంగంలోకి దిగిన మున్సిపాలిటీల్లో పరిస్థితులు చక్కబడ లేదు. 

చిట్యాల, మోత్కూరు మున్సిపాలిటీలు అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ పనులు అధ్వాన్నంగా ఉం డటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శివారు గ్రామాలన్నింటిని క లిపి మున్సిపాలిటీలుగా మార్చిన ప్రభుత్వం సరియైన వసతులు కల్పించ డంలో విఫలమైందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.