గాజులారామారంలో హైడ్రా కూల్చివేతలు.. ప్రభుత్వ ల్యాండ్ రికవరీ

గాజులారామారంలో హైడ్రా కూల్చివేతలు.. ప్రభుత్వ ల్యాండ్ రికవరీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో ఉద్రిక్తత నెలకొంది. గాజుల రామారం లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇండ్లు నిర్మించారంటూ హైడ్రా అధికారులు కూల్చేవేత చేపట్టారు. 

ఆదివారం (సెప్టెంబర్ 21) ఉదయం భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను తొలగించే వందల సంఖ్యలో పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో కలసి గాజులరామారం లో కూల్చివేతలు చేపట్టారు. అయితే స్థానికులు కూల్చివేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 

గాజుల రామారంలోని సర్వే నెంబర్లు 307,342,329/1,348లలో అక్రమంగా ఇండ్లు నిర్మించారని హైడ్రా అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు దాదాపు 500 మంది పోలీసులుహైడ్రా ఫోర్స్, జీహెచ్ఎంసి, రెవిన్యూ అధికారులతో కలిసి జేసీబీలతో  అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చివేశారు. 

గాజుల రామారం ఏరియాలో మొత్తం 300 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణకు గురైందని గుర్తించిన హైడ్రా కూల్చేవేతలు చేపట్టింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూమిలో బడా బాబుల ఆక్రమణలు చేశారని.. వందల ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయాలు చేశారని వారిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు తెలిపారు. 

పేదవారిని ముందు పెట్టి బడాబాబులు వేయించిన షెడ్డుల తొలగించారు. ఫుల్ ఫోర్స్ తో రంగంలో దిగిన హైడ్రా..ఆదివారం ఉదయం నుంచే ఆక్రమణలు తొలగింపు చేపట్టారు.