ఈనెల 10నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

ఈనెల 10నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

ఈ నెల 10వ తేదీ నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఈ నెల 24 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగనున్నా యి. ఈ పరీక్షలకు 61,431 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో 260 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బీ సుధాకర్ తెలిపారు. www.bse.telangana.gov.in నుంచి ప్రధానోపాధ్యాయులు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు జారీచేయాలన్నారు. అయితే ఎగ్జామ్ సెంటర్ లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు  అనుమతి లేదని తెలిపారు.