ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంట్ కు వచ్చిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ : ఢిల్లీ కాలుష్యంపై అవగాహన

ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంట్ కు వచ్చిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ : ఢిల్లీ కాలుష్యంపై అవగాహన

ఢిల్లీలో కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు.. దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు తన వంతు బాధ్యతతో ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంట్ కు వచ్చారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుందని.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు.. కాలుష్యం తగ్గించటంలో తన వంతు బాధ్యతగా ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంట్ కు వచ్చినట్లు స్పష్టం చేశారు ఎంపీ వంశీ కృష్ణ. 

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. 2025, డిసెంబర్ 16వ తేదీ ఉదయం లోక్ సభకు హాజరయ్యేందుకు కారులో కాకుండా.. ఎలక్ట్రిక్ బైక్ ను  స్వయంగా నడుపుకుంటూ పార్లమెంట్ కు వచ్చారు ఎంపీ  వంశీ కృష్ణ.

సరికొత్త ఫీచర్స్ తో 

సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్స్ తో ఎలక్ట్రిక్​ బైకులు తయారు చేసే ‘ఆటమ్​ మొబైల్’  ఢిల్లీ ద్వారక సెక్టార్ 5 లోని రాజాపురిలో తన మొదటి ఔట్ లెట్‌‌ను ఫిబ్రవరి 12, 2025న ఆటమ్​ మొబైల్ సంస్థ జేఎండీ, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించిన సంగతి తెలిసిందే..

ఆటమ్​ వేడర్–ఎస్ మామూలు ధర రూ. 1,08,500 కాగా...దీనిపై భారీగా  డిస్కౌంట్ ఆఫర్   అందిస్తోంది.   వేడర్​– ఈ, ఎక్స్ డిజైన్ల ధర రూ. 1, 38,000 కాగా, కేవలం రూ. 99,999 కు అమ్మతోంది.  వీటిని ఒకసారి ఛార్జ్ చేస్తే... 100 కిలోమీటర్లు వెళ్తాయి.  డిజైన్, చార్జింగ్, సీటింగ్, డ్రైవింగ్, మన్నికలో ఇవి ప్రత్యేకం .కేవలం మూడున్నర గంటల్లో చార్జ్​ చేయవచ్చు , గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న డిజైన్ల కన్నా ఈ బైక్ మోడల్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.