నేషనల్ హెరాల్డ్ కేసు..ఢీల్లీ కోర్టు కీలక నిర్ణయం.. రాహుల్, సోనియాలకు ఊరట

నేషనల్ హెరాల్డ్ కేసు..ఢీల్లీ కోర్టు కీలక నిర్ణయం.. రాహుల్, సోనియాలకు ఊరట

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించింది.  రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన మనీలాండరింగ్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు మంగళవారం(డిసెంబర్ 16)  కొట్టివేసింది.ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జీ షీట్ ను పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి (పిసి యాక్ట్) విశాల్ గోగ్నే తోసిపుచ్చారు.

ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్, సునీల్ భండారీలను ప్రధాన నిందితులుగా ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.నేషనల్ హెరాల్డ్(అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కు చెందిన రూ.2వేల కోట్లకు పైగా ఆస్తుల దుర్వినియోగం కేసులో  వారిని నిందితులుగా ఆరోపించింది.

►ALSO READ | SIR ఎఫెక్ట్ ..బెంగాల్ రాష్ట్రంలో 58 లక్షల ఓట్లు తొలగింపు

అక్టోబర్ 3న ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఎఫ్ఐఆర్ ఆధారంగా ఛార్జీషీటు  దాఖలు చేసింది ఈడీ. మోసం,ఆస్తి దుర్వినియోగం ,నేరపూరిత కుట్ర వంటి అభియోగాలతో గాంధీ కుటుంబం, సామ్ పిట్రోడా, సుమన్ దూబే, యంగ్ ఇండియన్ లను నిందితులుగా పేర్కొంది.మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 66 (2) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అందించిన సమాచారం ఆధారంగా ఈ FIR నమోదు చేసింది. 

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని ఈడీ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదుపై కోర్టు ఇచ్చిన కాగ్నిసెన్స్ ఆర్డర్ ఆధారంగా ఈడీ చర్యలు చేపట్టింది.