SIR ఎఫెక్ట్ ..బెంగాల్ రాష్ట్రంలో 58 లక్షల ఓట్లు తొలగింపు

SIR ఎఫెక్ట్ ..బెంగాల్ రాష్ట్రంలో 58 లక్షల ఓట్లు తొలగింపు

పశ్చిమ బెంగాల్ లో SIR  ఎఫెక్ట్.. వివిధ కారణాలతో లక్షలాది ఓట్లు తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం  బెంగాల్ ముసాయిదా ఓటర్ లిస్టును మంగళవారం (డిసెంబర్ 16)  ప్రకటించింది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)పై విమర్శలు వస్తున్న క్రమంలో పశ్చిమబెంగాల్‌లో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. 

తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 58 లక్షల ఓట్లను తొలగించారు. తొలగించిన  ఓట్లలో 24 లక్షల మంది మృతి చెందినవారు,19 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, 12 లక్షల మంది అడ్రసు లేదని, 1.3 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. 

►ALSO READ | పార్లమెంట్లో ప్రశ్నోత్తరాలు.సమగ్ర శిక్షా నిధుల వినియోగంలో..తెలంగాణ మెరుగైన పనితీరు : కేంద్రం