పార్లమెంట్లో ప్రశ్నోత్తరాలు.సమగ్ర శిక్షా నిధుల వినియోగంలో..తెలంగాణ మెరుగైన పనితీరు : కేంద్రం

పార్లమెంట్లో ప్రశ్నోత్తరాలు.సమగ్ర శిక్షా నిధుల వినియోగంలో..తెలంగాణ మెరుగైన పనితీరు : కేంద్రం
  • కేంద్రమంత్రి జయంత్‌‌ చౌదరి

న్యూఢిల్లీ, వెలుగు: సమగ్ర శిక్షా అభియాన్ స్కీం కింద నిధుల వినియోగంలో తెలంగాణ దేశంలోని అనేక పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరిచిందని కేంద్రం కితాబిచ్చింది. ఈ మేరకు  లోక్‌‌సభలో కాంగ్రెస్‌‌ ఎంపీ ఘురాం రెడ్డి ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్‌‌ చౌదరి సమాధానం ఇచ్చారు. గడిచిన ఐదేండ్లలో తెలంగాణలో ఈ స్కీం కింద రాష్ట్ర వాటాతో సహా రూ.7,110.87 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. అందులో కేంద్ర వాటా రూ.3952.78 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.