ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

ఏప్రిల్  25 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: ఓపెన్‌‌ స్కూల్‌‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్‌‌ఎస్‌‌సీ, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతాయని ఓపెన్‌‌ స్కూల్‌‌ సొసైటీ డైరెక్టర్‌‌ శ్రీహరి తెలిపారు. మే 2 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. టాస్‌‌ వెబ్‌‌సైట్‌‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా  ఒక సెషన్‌‌, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 దాకా మరో సెషన్ ఉంటుందన్నారు.