వారంలోపే టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్

వారంలోపే టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ  రిజల్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత నెలలో జరిగిన టెన్త్, ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వారంలోనే రిజల్ట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 12 నుంచి 20 వరకూ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.  మొత్తం 4,12,325 మంది విద్యార్థులు అటెం డ్ అయ్యారు. ఆ విద్యార్థుల ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియ ఆది వారం ముగిసింది. ప్రస్తుతం ఇంట ర్నల్ వర్క్ కొనసాగుతున్నది. ఈక్రమంలో వారంలోపే రిజల్ట్ వెల్లడించాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. కాగా, జూన్ 14 నుంచి 22 వరకూ టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగ్గా, ఈ పరీక్షలకు 60వేల మంది అటెండ్ అయ్యారు. పదిరోజుల క్రితమే టెన్త్ వాల్యుయేషన్ ప్రక్రియ ముగిసింది. ఇంటర్నల్ వర్క్ కూడా పూర్తయింది. దీంతో ఒకటీ, రెండ్రోజుల్లోనే టెన్త్ ఫలితాలు రిలీజ్ చేసే అవకాశముంది.