సర్పంచుల పాలన ముగిసింది..ఇక పల్లెల్లో ‘ప్రత్యేక’పాలన

సర్పంచుల పాలన ముగిసింది..ఇక పల్లెల్లో ‘ప్రత్యేక’పాలన
  • నేటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం
  • రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల చేతికి
  • ప్రత్యేక అధికారులుగా గెజిటెడ్ ఆఫీసర్లు?
  • హైకోర్టును ఆశ్రయించిన సర్పంచులు

హైదరాబాద్:సర్పంచుల పదవీకాలం కొన్ని గంటల్లో ముగియనుంది. గ్రామాలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్లనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుంది.  ప్రత్యేక అధికారులుగా గెజిటెడ్ ఆఫీసర్లనే నియమించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది.

సమీపంలో లోక్ సభ ఎన్నికలు ఉండటం ఇతరత్రా కారణాల రీత్యా ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్లుగా ఎవరిని నియమించాలనే దానిపై  జాబితా సిద్దం చేయాలని అధికారులను  సీఎం ఆదేశించారు.

ఇదిలా ఉండగా పలువురు సర్పంచులు తమ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ హైకోర్టను ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది.