తెప్ప సముద్రం మూవీ ఏప్రిల్ 12న విడుదల

తెప్ప సముద్రం మూవీ ఏప్రిల్ 12న విడుదల

చైతన్య రావు, అర్జున్ అంబటి  హీరోలుగా ‘కొరమీను’  ఫేమ్ కిశోరి దాత్రక్  హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. రవి శంకర్ కీలక పాత్ర పోషించాడు.  సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న సినిమా విడుదల కానుంది. 

ఇప్పటికే టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్న టీమ్.. తాజాగా ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. పీఆర్ కంపోజ్ చేసిన పాటను పెంచల్ దాస్ స్వయంగా రాయడంతోపాటు తనే పాడాడు. ‘నా నల్లా కలువా పువ్వా.. ’ అంటూ ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గా సాగిందీపాట. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘సినిమా అవుట్‌‌‌‌‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాం’ అని అన్నారు.