కృష్ణా నదికి పెరిగిన వరద.. తెప్పోత్సవం రద్దు...

కృష్ణా నదికి పెరిగిన వరద.. తెప్పోత్సవం రద్దు...

దసరా సందర్భంగా ఏపీలోని ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ( అక్టోబర్ 1 ) 10వ రోజు మహర్నవమి నాడు మహిషాసుర మర్ధిని అవతారంలో దర్శనమిచ్చారు కనకదుర్గా దేవి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఇవాళ కృష్ణా నదిపై నిర్వహించే తెప్పోత్సవానికి ప్రత్యేకత ఉంది. అయితే.. దుర్గ ఘాట్ పై ఇవాళ జరగాల్సిన తెప్పోత్సవం కార్యక్రమాన్ని రద్దు చేశారు. కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో అమ్మవారి తెప్పోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

కృష్ణా నదికి వరద ఉదృతి పెరిగిన క్రమంలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహణ అసాధ్యమని ఆలయ కమిటీకి సూచించింది నీటిపారుదల శాఖ. ప్రస్తుతం కృష్ణా నదిలో 6.5 క్యూసెక్కుల వరద ప్రవాహం నదిలోకి వస్తుందని.. ప్రవాహం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు అధికారులు

రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన క్రమంలో హంస వాహనంపై తెప్పోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఈ క్రమంలో కకృష్ణా నదిపై పండు వెన్నెల్లో విద్యుత్ దీపాలంకరణతో హంస వాహనంపై శోభాయమానంగా జరిగే తెప్పోత్సవం చూసేందుకు వచ్చిన భక్తులు నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు.