టెర్రరిస్టులు చొరబడ్డారు: ఎయిర్‌బేస్‌ల వద్ద హై-అలర్ట్‌

టెర్రరిస్టులు చొరబడ్డారు: ఎయిర్‌బేస్‌ల వద్ద హై-అలర్ట్‌

పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ భారత్ లో దాడులకు ప్లాన్ చేసిందని ఇంటెలిజెన్స్ వార్నింగ్ అలర్ట్ ఇచ్చింది. 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడ్డారని వారంతా ఎయిర్ ఫోర్స్ కు చెందిన స్థావరాలను టార్గెట్ చేశారని ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చాయి. జమ్మూకశ్మీర్ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ లు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు తెగబడే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో శ్రీనగర్, అవంతిపొర, జమ్మూ, పఠాన్ కోట్, హిండన్ ఎయిర్ బేస్ లలో ఆరెంజ్ లెవెల్ హైఅలర్ట్ ప్రకటించారు. అక్కడ సెక్యూరిటీ టైట్ చేశారు. భద్రతా పరిస్థితులను సీనియర్ అధికారులు సమీక్షిస్తున్నారు.

పంజాబ్ లోకి డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. AK 47 తుపాకులు, గ్రెనేడ్లు హెవీ లిఫ్టింగ్ డ్రోన్ల ద్వారా అమృత్ సర్ సిటీలోకి జారవిడిచారు ఉగ్రవాదులు. 10 సార్లు ఇలా జరిగిందని అమృత్ సర్ పోలీసులు తెలిపారు. ఈ విషయాలను ట్విట్టర్ లో అమిత్ షాకు తెలిపారు అమరీందర్ సింగ్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి… డ్రోన్ల సమస్యను త్వరగా హ్యాండిల్ చేయాలని అమిత్ షాను కోరారు అమరీందర్ సింగ్.

ఈ విషయంపై స్పందించారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. జాతీయ భధ్రతకు ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందన్నారు రాజ్ నాథ్. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాన్ని మళ్లీ ఓపెన్ చేశారన్న ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపైనా రాజ్ నాథ్ స్పందించారు. సైన్యం సన్నధ్ధంగా ఉందని… దాని గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు రాజ్ నాథ్.