కశ్మీర్‌లో టెర్రరిజం ఇక ఉండదు : అమిత్ షా

కశ్మీర్‌లో టెర్రరిజం ఇక ఉండదు  : అమిత్ షా

కశ్మీర్ లో ఉగ్రవాదం అనేది ఇకనుంచి ఉండదని.. దాన్ని అంతమొందిస్తామని చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కశ్మీర్ లో టెర్రరిజాన్ని ఫినిష్ అవుతుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. అభివృద్ధి బాటలో జమ్ముకశ్మీర్ ఇకనుంచి పయనిస్తుందని అన్నారు.

జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి, ఆర్టికల్ 370ని గతంలో ఎన్నడో తొలగించాలనే అభిప్రాయంతో ఉండేవాడిని అని అమిత్ షా చెప్పారు. ఈ పని గతంలోనే చేసి ఉండాల్సిందని అనిపించేదన్నారు. ఆర్టికల్ 370 రద్దు , తర్వాత పరిణామాలపై తనకు కన్ఫ్యూజన్ ఏమాత్రం లేదన్నారు. పరిణామాలను ముందే ఊహించామనీ.. జరగబోయే మంచిపై దృఢమైన నమ్మకంతో ఉన్నామని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దుచేస్తేనే.. కశ్మీర్ ప్రగతి బాట పడుతుందని గట్టిగా నమ్మి.. ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పై రాసిన ‘లిజనింగ్, లర్నింగ్ అండ్ లీడింగ్’ అనే పుస్తకాన్ని ఆయనతో కలిసి అమిత్ షా ఆవిష్కరించారు. రెండేళ్లుగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్య కెరియర్ పై ఈ పుస్తకం ప్రచురించారు.

జమ్ముకశ్మీర్ బిల్లు రాజ్యసభలో ముందు ప్రవేశపెట్టినప్పుడు కొంత ఆందోళన ఉండేదని… వెంకయ్యనాయుడు నేర్పుతో బిల్లుకు సభామోదం వచ్చేలా చేశారని అన్నారు. ఇలాంటి నాయకుల వల్లే పెద్దల సభ గౌరవం పెరుగుతుందని అన్నారు అమిత్ షా.