
శ్రీనగర్: టెర్రరిజం ఎప్పటికీ విజయవంతం కాదు అని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. పహల్గాం టెర్రర్ అటాక్ కు పాల్పడిన వారిని భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (జులై 29) ఫరూక్ అబ్దుల్లా విలేకర్లతో మాట్లాడారు.
‘‘ఆ టెర్రరిస్టులను నేను చూడలేదు. వారెవరో నాకు తెలియదు. టెర్రరిస్టులను చూసిన వారు మాత్రమే వారిని గుర్తించగలరు. వారు చనిపోతే అది మంచి విషయం. టెర్రరిజం ఎప్పటికీ విజయం సాధించదు అనే లెసన్ వారికి తెలిసొచ్చింది” అని ఆయన తెలిపారు. పహల్గాం అటాక్ కు పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టులను శ్రీనగర్ సమీపంలో భద్రతాదళాలు మట్టుబెట్టాయి.