రా.. చూస్కుందాం.. మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రా.. చూస్కుందాం.. మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఇరువురి మధ్య కేజ్ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

న్యూఢిల్లీ: టెస్లా బాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెటా సీఈఓ మార్క్ జూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ అంగీకరించారు. లొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పు వస్తానని సవాల్ చేశారు. అసలు ఛాలెంజ్ ఏంటంటే  లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేగాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఆక్టాగాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేజ్ (బోను) ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం. నమ్మడానికి కష్టంగా ఉన్నా..అన్నీ కుదిరితే  టాప్ ధనవంతులు డబ్ల్యూడబ్ల్యూఈ మాదిరి దెబ్బలాడుకోవడం చూడొచ్చు. మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా జూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెస్పాండ్ అయ్యారు. ఒక్క చేతితో ఓడిస్తానని ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

అసలు గొడవ ఎలా స్టార్టయిందంటే?

మార్క్ జూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జి జిట్సూ (ఒక రకం మార్షల్ ఆర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోటీలలో ఒకటి కంటే  ఎక్కువ సార్లు ఛాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచారు. జూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్  జి జిట్సూ లెజెండ్ మైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముసుమెసితో కలిసి ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవడంపై ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టోరీ పెట్టారు. దీనిపై  ‘కేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కు రా అంటూ ఎలన్ మస్క్ సవాలు విసిరారు. మరోవైపు  ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోటీగా త్రెడ్స్‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెచ్చే పనిలో మెటా ఉంది. కంటెంట్ క్రియేటర్లు, పబ్లిక్ ఫిగర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుద్ది ఉన్నవాళ్లు నడిపే ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం చూస్తున్నారని మెటా ఎగ్జిక్యూటివ్ ఒకరు కామెంట్ చేశారు.   ‘ ఇంకెటువంటి ఆప్షన్స్ లేకుండా జూక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బొటన వేలు కింద ఉండడానికి భూమి ఎదురు చూస్తోంది. కనీసం ఇది ‘బుర్రన్నది’  కాదేమోనని క్షణం పాటు  భయపడ్డా’ అంటూ మస్క్ రిప్లై ఇచ్చారు.