
న్యూఢిల్లీ: గ్లోబల్ ఈవీ కంపెనీ టెస్లా వచ్చే వారం ముంబైలో తన మొదటి ఎక్స్పీరియన్స్సెంటర్ను ప్రారంభించనుంది. ఈనెల 15న జరిగే ప్రారంభోత్సవం కోసం ఇన్విటేషన్లను పంపింది. అమెరికాలోని ఆస్టిన్ ప్రధాన కార్యాలయం కలిగిన కంపెనీ ఇప్పటికే దాని చైనా ప్లాంట్ నుంచి మొదటి సెట్ కార్లను దిగుమతి చేసుకుంది.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఎక్స్పీరియన్స్సెంటర్, టెస్లా ఉత్పత్తులను, ముఖ్యంగా తన ఎలక్ట్రిక్ కార్లను భారతీయ కస్టమర్లకు పరిచయం చేస్తుంది. ఇది మొదట్లో దిగుమతి చేసుకున్న మోడళ్లను విక్రయించే అవకాశం ఉంది. ఆ తర్వాత దేశీయంగా ఉత్పత్తి చేసే ప్రపోజల్స్‌ను కూడా పరిశీలించే అవకాశం ఉంది.