ముగిసిన టెట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్

ముగిసిన టెట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్
  • అటెండ్ అయిన 73 వేల మంది

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు రోజులుగా జరుగుతున్న టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ స్ర్టీమ్ ఎగ్జామ్ ముగిసింది. మొత్తం 93,378 మంది అభ్యర్థులకు గాను 73,571 మంది పరీక్షకు అటెండ్ అయ్యారు. వివిధ కారణాలతో 19,807 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. 

ఇదే స్ర్టీమ్​కు చెందిన  మైనర్ మీడియంలో పరీక్ష రాసే 6,596 మందికి జూన్ 1న పరీక్ష జరగనున్నది. కాగా, ఈ నెల 24, 28, 29 తేదీల్లో పేపర్2 సోషల్ స్టడీస్ ఎగ్జామ్ జరగనుంది. దీనికి 86,454 మంది అటెండ్ కావాల్సి ఉంది.