
అమెరికాలోని టెక్సాస్ లో వరద బీభత్సం సృష్టించింది. శుక్రవారం(జూలై4) టెక్సాస్ హిల్లో సంభవించిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 13మంది చనిపోయారు.భారీ విధ్వంసం జరిగింది. సమ్మర్ క్యాంపుకు వెళ్లిన 20మంది చిన్నారులు వరదల్లో గల్లంతయ్యారు. ఎలాంటి ప్రమాద హెచ్చరికల వ్యవస్థ లేకపోవడం వల్లే భారీ ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగిందని తెలుస్తోంది.
ఉరుములు, కుండపోత వర్షం టెక్సాస్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది. శుక్రవారం గ్వాడాలుపే నదిలో వరదలు ఉప్పొంగి ప్రవహించి 13 మంది మృతి చెందగా, చాలా మంది గల్లంతయ్యారు. వేసవి శిబిరంలో ఉన్న 20 మందికి పైగా బాలికలు వర్షాల కారణంగా అదృశ్యమయ్యారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం అవుతున్న టెక్సాస్ లో శుక్రవారం కొన్ని గంటల్లోనే కురిసిన భారీ వర్షంతో ఆ ప్రాంతంలో ప్రాణనష్టం, విధ్వంసం సృష్టించింది.
ఉదృతంగా ప్రవహిస్తున్న గ్వాడలూనా నది వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలు, హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆకస్మిక వరదలతో గ్వాడలూనా నది తీర ప్రాంతాలు, పిల్లల వేసవి శిబిరాలను ముంచెత్తాయి. దీంతో 20 మంది బాలికలు వరదనీటిలో కొట్టుకుపోయారు.
హెచ్చరిక వ్యవస్థ లేకపోవడం వల్లే..
మరోవైపు న్యూజెర్సీలో బలమైన తుఫానుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.వారిలో చెట్టు కూలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ విధ్వంసం కారణంగా ప్లెయిన్‌ఫీల్డ్ నగరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రద్దు చేసింది.
దక్షిణ న్యూ ఇంగ్లాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్తు అంతరాయం, వడగళ్ల వాన,రహదారులు మొత్తం బ్లాక్ అయ్యాయి. టెక్సా్స్ లోని టెక్సాస్ హిల్స్ ప్రాంతంలో వరద హెచ్చరిక వ్యవస్థ లేదని లేకపోవడం వల్లే భారీ ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది.