డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా..

డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా..

సినిమాను థియేటర్స్​లో ప్రదర్శించే డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్ డీ అధిక యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం దగ్గర తెలంగాణ ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ వారానికి పది వేల రూపాయలు వసూలు చేస్తున్నారని,  దీని వల్ల ఒక్కో సినిమా రిలీజ్‌‌కు పది లక్షల భారాన్ని నిర్మాతలు మోయాల్సి వస్తోందని టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.  

ఈ కంపెనీల్లో భాగస్వాములైన ముగ్గురు నిర్మాతలు తమ స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆరోపించారు. లయన్ సాయివెంకట్,  డి ఎస్ రెడ్డి, గురురాజ్‌‌, సిరాజ్‌‌ సహా పలువురు నిర్మాతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.