
తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకలు దుబాయ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. దీనికోసం 13 మంది జ్యూరీ సభ్యులను సెలెక్ట్ చేశారు.
ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌కి జ్యూరీ సభ్యులు బి. గోపాల్, మురళీ మోహన్, సుమన్, శివాజీ రాజా, రేలంగి నరసింహారావు, రోజారమణి తదితరులు హాజరై.. ఆగస్టు 12 న దుబాయ్‌లో జరిగే టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ విజయవంతం కావాలని అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘2021–22 సంవత్సరంలో విడుదలైన చిత్రాల వాళ్లు టీఎఫ్‌సీసీ వెబ్‌సైట్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. చివరి తేది జూన్ 15. తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్‌తో ఈ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించబోతున్నాం’ అని అన్నారు.