జులై ఫస్ట్ వీక్లో టీజీ సీపీగెట్..షెడ్యూల్ రిలీజ్ చేసిన బాలకిష్టా రెడ్డి

జులై ఫస్ట్ వీక్లో టీజీ సీపీగెట్..షెడ్యూల్ రిలీజ్ చేసిన బాలకిష్టా రెడ్డి

కేయూ క్యాంపస్, వెలుగు: కాకతీయ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీ సీపీగెట్)-2026 జులై మొదటి వారంలో నిర్వహించనున్నారు. బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సీపీగెట్ రిలీజ్ చేశారు. దీని ప్రకారం.. ఈ నెల 15 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో సీపీగెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

రూ.500 ఫైన్ తో జూన్ 14,  రూ.2 వేల ఫైన్ తో జూన్ 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అనంతరం జూన్ 24న టెస్ట్ సెంటర్లను ఫైనల్ చేసి, జులై ఫస్ట్ వీక్ లో టీజీ సీపీగెట్-2026 పరీక్షను ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు. జులై 17న ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసి, 19 వరకు ఆబ్జెక్షన్స్ స్వీకరించనున్నారు. అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం తుది ఫలితాలను వెల్లడించనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్​  పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి, టీజీసీపీగెట్ కన్వీనర్ రాజేందర్, వీసీలుకుమార్, ఉమేశ్ కుమార్, శ్రీనివాస్, సూర్యధనుంజయ్, రామచంద్రం, వెంకటరాంరెడ్డి పాల్గొన్నారు.