నేటి( జూన్ 06 ) నుంచి డీఈఈసెట్ వెబ్ ఆప్షన్లు

నేటి( జూన్ 06 ) నుంచి డీఈఈసెట్ వెబ్ ఆప్షన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డైట్ కాలేజీల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌‌‌‌ఈ) కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి డీఈఈసెట్- వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానున్నదని డీఈఈసెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ వరకు అధికారిక వెబ్‌‌‌‌సైట్ ద్వారా తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకోవచ్చని సూచించారు.

ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌‌‌కు హాజరుకాని వారి కోసం గడువును శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థులు తమ ఆప్షన్లను 9న ఎడిట్ చేసుకోవచ్చని, జూన్ 14న సీట్ల కేటాయింపు ఉంటుందని, ఎంపికైన వారు 17లోగా ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. కాగా, కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.