
హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్ సెట్ మాక్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. దీనిలో 77,154 మందికి సీట్లు కేటాయించారు. అయితే, ఈ నెల 14,15 తేదీల్లో వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంది. ఈ నెల 1 నుంచి 8 వరకు జరిగిన ఎప్ సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 95,256 మంది అటెండ్ అయ్యారు. వీరిలో 94,059 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.
వీరంతా 56.63 లక్షల ఆప్షన్లు ఇచ్చారు. అయితే, కన్వీనర్ కోటాలో రాష్ట్రవ్యాప్తంగా 172 కాలేజీల్లో 83,054 సీట్లు ఉండగా, 77,154 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. మరో 59,00 సీట్లు మిగిలాయి. కాగా, తక్కువ ఆప్షన్లు ఇచ్చిన 16,905 మందికి సీట్లు అలాట్ కాలేదు. మొత్తం 20 వర్సిటీ కాలేజీల్లో 6,091 సీట్లకు 5,148 సీట్లు...149 ప్రైవేటు కాలేజీల్లో 75,384 సీట్లకు 70,515 సీట్లు అలాట్ అయ్యాయి.