
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ టీజీ ఎప్సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 95,256 మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ లో పాల్గొనగా.. 94.059 మంది వెబ్ ఆప్షన్ ప్రక్రియలో పాల్గొన్నారని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు.
56.63 లక్షల వెబ్ ఆప్షన్లు పెట్టారని.. అత్యధిక ఒక విద్యార్థి 1051 ఆప్షన్లు ఇచ్చారని వెల్లడించారు. ఈ నెల 13న మాక్ సీట్ల అలకేషన్ ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఈ నెల14,15 తేదీల్లో వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉండగా.. 18న ఫైనల్ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది.