
గంగాధర/చొప్పదండి, వెలుగు: గంగాధర మండలం గర్శకుర్తిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్అధికారులు వారం కింద సీజ్ చేసి, పవర్లూమ్స్పై నమోదు చేసిన కేసును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో అధికారులు ఎత్తేశారు. బుధవారం గర్శకుర్తిలోని విజిలెన్స్ దాడిచేసిన పవర్‌లూమ్స్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు.
అనంతరం చేనేత కార్మికుడిపై అధికారులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని, సీజ్ చేసిన పవర్లూమ్స్తిరిగి పునరుద్ధరించాలని చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజారామయ్యర్‌కు ఫోన్ చేసి కోరారు. కమిషనర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు కేసులను ఎత్తేసి, సీజ్ చేసిన పవర్‌లూమ్స్‌ను తిరిగి పునరుద్ధరించారు. అంతకుముందు గర్శకుర్తికి చెందిన కొట్టపల్లి స్రవంతి క్యాన్సర్తో చనిపోగా.. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రూ.50 వేలు చెక్కు అందజేశారు.
నారాయణపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న తమకు పరిహారం అందజేసి ఆదుకోవాలని చెర్లపల్లి(ఎన్) గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి మొరపెట్టుకున్నారు. చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు ఆఫీసులో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ఎమ్మెల్యే సత్యం పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుండడంతో పండగ వాతావరణం నెలకొందన్నారు.