
మహబూబ్‌నగర్/ కందనూలు/ ఖిల్లాగణపురం, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా మెగా క్యాంప్లు ప్రారంభమయ్యాయి. నారాయణపేట మండలం అప్పక్‌పల్లి గ్రామ శివారులోని జిల్లా ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంప్‌ను ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే పలు రకాల టెస్టులు చేయించుకున్నారు. మెగా హెల్త్ క్యాంప్‌లో మహిళలు, చిన్న పిల్లలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు. మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తారని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ఖిల్లాగణపురం పీహెచ్సీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. మహిళలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు.