CSSHతో శ్రీనిధి డెక్కన్‌‌‌‌ ఫుట్ బాల్ క్లబ్ ఒప్పందం

CSSHతో  శ్రీనిధి డెక్కన్‌‌‌‌ ఫుట్ బాల్ క్లబ్ ఒప్పందం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: శ్రీనిధి డెక్కన్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ క్లబ్‌‌‌‌ (ఎస్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ) తమ ప్లేయర్ల ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌, హెల్త్ విషయంలో మరింత ఫోకస్ పెట్టేందుకు సెంటర్‌‌‌‌ ఫర్‌‌‌‌ స్పైన్‌‌‌‌ అండ్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ హెల్త్‌‌‌‌ (సీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌)తో  ఒప్పందం కుదుర్చుకుంది. 

నేషనల్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, సీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ కో ఓనర్ అయిన పుల్లెల గోపీచంద్‌‌‌‌ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై ఎస్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ చీఫ్ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ ఆఫీసర్ ఫాబియో పెరీరా సంతకం చేశాడు. 

సీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ ఇకపై శ్రీనిధి టీమ్‌‌‌‌కు అఫీషియల్ స్పోర్ట్స్‌‌‌‌ సైన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌గా  వ్యవహరించనుంది. గాయాల బారిన ప్లేయర్లు వేగంగా కోలుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెరుగైన చికిత్స వంటి సేవలు అందించనుంది.