
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం టీజీ ఎడ్ సెట్–2025 అడ్మిషన్ రిలీజ్ అయింది. ఈ నెల21 నుంచి ఆన్ లైన్ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. శుక్రవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఎడ్ సెట్ కమిటీ సమావేశమైంది. ఈ నెల 14న అడ్మిషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నెల 21 నుంచి 31 వరకూ ఆన్ లైన్ రిజిస్ర్టేషన్లు, ఆన్ లైన్ ఫీజు చెల్లింపుతో పాటు సర్టిఫికేట్ల అప్లోడ్ కు అవకాశం కల్పించారు. మరిన్ని వివరాలను http://edcetadm.tgche.ac.in వెబ్ సైట్లో పెడ్తామని అధికారులు ప్రకటించారు.
జులై 14న పీఈసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్
ఈ నెల 14న బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. శుక్రవారం టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో పీఈసెట్ అడ్మిషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ నెల 23 నుంచి 29 వరకూ రిజిస్ర్టేషన్లు, ఫీజు చెల్లింపుల ప్రక్రియ ఉంటుంది. 31, ఆగస్టు 1న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్టు 4న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ జరుగుతుంది.