ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ సంబురాలు

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ సంబురాలు

ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, జనగామ, మహబూబాబాద్​ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ విప్​లు అయిలయ్య, రామచంద్రునాయక్, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేడుకలకు రాష్ట్ర ట్రైకార్​ చైర్మన్​ డాక్టర్​ బెల్లయ్య నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాలు ఎగురవేసి, అమర వీరుల స్తూపాలకు నివాళులర్పించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఎగురవేయగా, ప్రభుత్వ స్కూళ్లు, కార్యాలయాల్లో అధికారులు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తుకు చేసుకున్నారు. – వెలుగు, నెట్​వర్క్​