పెరియార్ ఆశయాలను కొనసాగిద్దాం

పెరియార్ ఆశయాలను కొనసాగిద్దాం

కోల్​బెల్ట్, వెలుగు: పెరియార్ రామస్వామి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ బలహీనవర్గాల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్​మోతె రాజలింగు అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణం గాంధీనగర్​లోని టీబీఎస్ఎస్ ఆఫీస్​లో పెరియార్​146వ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 

బ్రిటిష్​ పాలకులను ఎదిరిస్తూనే బలహీన వర్గాల ప్రజల విముక్తి, మహిళల స్వాభిమానం కోసం పెరియార్​కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో లీడర్లు గంధం బాబురావు, వెల్పుల మల్లేశ్, లింగంపల్లి శ్రీనివాస్, కాంపెల్లి శ్రీకాంత్​తదితరులు పాల్గొన్నారు.