‘స్వస్థ్ నారీ సశక్త్’ కార్యక్రమం ప్రారంభం

‘స్వస్థ్ నారీ సశక్త్’ కార్యక్రమం ప్రారంభం

నర్సాపూర్(జి), వెలుగు: నర్సాపూర్  జి మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో స్వస్థ్​ నారీ సశక్త్​ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం ప్రారంబించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు పోషణ, అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. 

స్వస్థ్​ నారీ సశక్త్​ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని మహేశ్వర్​ రెడ్డి అన్నారు. ప్రజలకు ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని సూచించారు. 

అనంతరం ఆస్పత్రి వార్డులను పరిశీలించి రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డీఎంహెచ్​వో రాజేందర్, సూపరింటెండెంట్ గోపాల్ సింగ్, డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, వైద్యాధికారులు, బీజేపీ మండల అధ్యక్షులు నరేందర్, శ్రీకాంత్ రెడ్డి, దత్తురాం, అర్జున్, మహిపాల్, ప్రవీణ్, గంగాధర్, విజయ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరు

సారంగాపూర్, వెలుగు: రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్​లో ప్రెస్​మీట్​నిర్వహించి మాట్లాడారు. సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి, ఆలూరు గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే  మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 

బీరవెల్లి గ్రామ లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణకు రూ.69 లక్షలు,  ఆలూరు లిఫ్ట్ ఇరిగేషన్​కు రూ.32.50 లక్షలు  మంజూరైనట్లు వెల్లడించారు. ఆలూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు. ఈ పనులు పూర్తయితే గ్రామాల్లోని రైతులకు నీటి సౌకర్యం లభించి, వ్యవసాయానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.