ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జూలై 1 నుంచి వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులకు ఇది నిజంగా పండగనే చెప్పవచ్చు.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు.. పెండింగ్ లో ఉన్న డీఏతో పాటు డీఏలు, మెడికల్ బిల్లులు, ఈహెచ్ఎస్ స్కీమ్, లోక్ సభ ఎన్నికల టైమ్ లో బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి పాత స్థానాల్లోకి పంపించడం, సీపీఎస్ రద్దు తదితర మొత్తం 50 సమస్యలపై ఆందోళన చేస్తున్నారు.
Also Read :- గల్లీల్లో పటాకులు పెడితే ప్రమాదాలు జరుగుతాయ్
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టబడి ఉన్నామన్న ప్రభుత్వం.. అక్టోబర్ 26న జరిగిన కేబినెట్ భేటీలో గవర్నమెంట్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండు డీఏల (కరువు భత్యం) విడుదలకు గ్న్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీపావళి పండుగ వేళ పెండింగ్లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఉద్యోగులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.