హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ ఫలితాలను రిలీజ్ చేయనున్నట్టు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రవి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ రిజల్ట్స్, ర్యాంకు కార్డులను https://icet.tgche.ac.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
