పీవోకేలో మళ్లీ కాల్పులు 16 మంది మృతి

పీవోకేలో మళ్లీ కాల్పులు 16 మంది మృతి

రావలకోట్‌‌‌‌:  పాక్ ఆర్మీ కాల్పుల్లో 16మంది నిరసనకారులు మృతిచెందగా, 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో రావలకోట్‌‌‌‌లోని ఈద్గా మైదానంలో ప్రజలు ఆహార ధాన్యాల ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గించాలని, ప్రాథమిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ గురువారం భారీ నిరసన చేపట్టారు. సుమారు 60 నుంచి 70 వేల మంది నిరసనలో పాల్గొన్నారు. 

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై భద్రతా బలగాలు ఒక్కసారిగా ఏకే-47 రైఫిళ్లతో కాల్పులు జరిపినట్లు తెలిసింది. అక్కడికక్కడే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. 

ఈ ఘటన మరువకముందే మరోసారి కాల్పులు జరగడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని స్థానిక రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.