ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ డిపాజిట్లపై 7.10 శాతం వరకు వడ్డీ.. డాలర్లను ఆకర్షించేందుకు డిపాజిట్‌‌‌‌‌‌‌‌ రేట్లను పెంచిన బ్యాంకులు

ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ డిపాజిట్లపై 7.10 శాతం వరకు వడ్డీ.. డాలర్లను ఆకర్షించేందుకు డిపాజిట్‌‌‌‌‌‌‌‌ రేట్లను పెంచిన బ్యాంకులు

ముంబై:  ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐల నుంచి డిపాజిట్లను ఆకర్షించడానికి  పలు బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేటును  ఏకంగా 350 బేసిస్ పాయింట్ల (3.50 శాతం)  వరకు పెంచాయి. 3 నుంచి 5 ఏళ్ల ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ డిపాజిట్లపై అయ్యే పూర్తి హెడ్జింగ్ ఖర్చును  తామే భరిస్తామని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించడంతో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 

కాగా, బ్యాంకులు ఫారిన్ కరెన్సీ  డిపాజిట్లు స్వీకరించినప్పుడు  హెచ్చుతగ్గుల వల్ల నష్టపోకుండా ఉండడానికి ఈ కరెన్సీలకు వ్యతిరేకంగా హెడ్జింగ్ చేస్తాయి. ఈ ఖర్చును బ్యాంకులే భరించాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఖర్చులను తామే  భరిస్తామని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించింది. రూపాయి పతనాన్ని ఆపడానికి, డాలర్లను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

  • హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్:3 నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ రేటును 3 శాతం పెంచి 6 శాతానికి చేర్చింది.
  • ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 3 ఏళ్ల డిపాజిట్లపై 7.1శాతం, 5 ఏళ్లపై 7శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
  • యెస్ బ్యాంక్:  కాలపరిమితిని బట్టి 7శాతం నుంచి 7.10శాతం వరకు వడ్డీ రేట్లను నిర్ణయించింది.  

ఈ చర్యలతో ఇండియన్ బ్యాంకులు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి  సుమారు 35–40 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను సేకరించొచ్చని అంచనా.  ఆర్​బీఐ మాత్రం వడ్డీరేట్లను మార్చలేదు.