ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందుల అమ్మకాలు

ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందుల అమ్మకాలు
  •     137 మెడికల్ షాపులకు నోటీసులు జారీ చేసిన టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్

హైదరాబాద్, వెలుగు: ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు మందుల అమ్మకాలు జరుపుతున్న మెడికల్ షాపులపై టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ దాడులు చేసింది. ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ​మెంట్ పోలీసులతో కలిసి క్యూర్ ఏరియాలోని సరూర్​నగర్, బాలాపూర్, హయత్‌‌‌‌‌‌‌‌నగర్, ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, అంబర్‌‌‌‌‌‌‌‌పేట్ జోన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. డెకాయ్ ఆపరేషన్లు, టెస్ట్ పర్చేజ్‌‌‌‌‌‌‌‌ ల ద్వారా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టింది. షెడ్యూల్ హెచ్ 1, షెడ్యూల్ ఎక్స్ పరిధిలోని ఆల్ప్రజోలం, నైట్రాజెపామ్, కోడైన్ సిరప్‌‌‌‌‌‌‌‌లు, ట్రామడాల్, టపెంటడాల్, జాల్పిడెమ్, ప్రెగాబాలిన్ వంటి మందుల అమ్మకాలను పరిశీలించింది. ఈతనిఖీల్లో రూల్స్ తుంగలో తొక్కిన మొత్తం 137 మెడికల్ షాపుల్లో అవకతవకలను అధికారులు గుర్తించారు.

ఫార్మిసిస్టులు లేకుండానే అమ్మకాలు

తనిఖీల్లో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు అమ్మడం, షాపుల్లో అర్హత కలిగిన ఫార్మసిస్ట్ లేకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. రిజిస్టర్లు లేకపోవడం,  అమ్మకాల బిల్లులను చూపించకపోవడం గుర్తించారు. దీంతో ఉల్లంఘనలకు పాల్పడిన 137 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్–1940 రూల్స్ ప్రకారం లైసెన్సులను సస్పెండ్ లేదా రద్దు చేస్తామని, ప్రాసిక్యూషన్ చర్యలు ఉంటాయని టీజీ సేఫ్ కమిషనర్ స్పష్టం చేశారు.