- టీజీజీడీఏ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్)లోని డాక్టర్లకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. టీవీవీపీని రద్దు చేస్తూ కొత్తగా ఏర్పాటైన డీఎస్‌హెచ్‌ను రాష్ట్ర ప్రభుత్వ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో 72 జారీ చేసింది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న డాక్టర్ల సర్వీస్ అంశాలను వచ్చే రెండు రోజుల్లోనే పూర్తి చేయాలని టీజీజీడీఏ కోరింది.
శాఖ పేరును అన్ని అధికారిక రికార్డులు, వెబ్‌సైట్లలో మార్పు చేయడంతోపాటు శాశ్వత లేదా ఇన్‌చార్జి డైరెక్టర్‌ను నియమించి పరిపాలనను వేగవంతం చేయాలని అసోసియేషన్ నేతలు బి.నరహరి, లాలూప్రసాద్ రాథోడ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్లకు స్పెషల్ ఇంక్రిమెంట్లు, సర్వీస్ సంబంధిత ఫైళ్లను వెంటనే క్లియర్ చేసి పూర్తిస్థాయి పరిపాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సకాలంలో సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందుతాయని స్పష్టం చేశారు.
