
- టీజీడీడీసీఎఫ్ జీఎం మధుసూదన్ రావు
మెదక్, వెలుగు: వినియోగదారులకు నాణ్యమైన పాలు సరఫరా చేయడం విజయ డెయిరీ లక్ష్యమని తెలంగాణ స్టేట్‌డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీఎస్ డీడీసీఎఫ్) జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని విజయ డెయిరీలో డీడీ రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాల ఉత్పత్తిదారులకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
స్వచ్ఛమైన పాల సేకరణ, సరఫరాపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. ఈ విషయంలో రాజీ పడకుండా రైతుల నుంచి పాలను సేకరించేటప్పుడే ఎనలైజర్లతో పరీక్షించి కొనుగోలు చేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పాలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. విజయ డెయిరీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుదన్నారు.