టీజీవో ఎన్నికల నిర్వహణ చట్ట విరుద్ధం: ఏలూరు శ్రీనివాస్ రావు

టీజీవో ఎన్నికల నిర్వహణ చట్ట విరుద్ధం:  ఏలూరు శ్రీనివాస్ రావు

హైదరాబాద్, వెలుగు: చట్ట బద్ధత లేని, కాలం చెల్లిన  టీజీవో సీఏ (సెంట్రల్ అసోసియేషన్ ) ప్రస్తుత కార్యవర్గం ఎన్నికల  ప్రక్రియను  నిర్వహించడం చట్టవిరుద్ధమని టీజీవో ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు ఆరోపించారు. ఆదివారం రాష్ర్ట కార్యవర్గ సమావేశం నిర్వహించగా శ్రీనివాసరావు పత్రిక ప్రకటనను జారీ చేశారు. 

మాజీ  మంత్రి  శ్రీనివాస్  గౌడ్, అతడి కీలు బొమ్మలు, రిటైర్  అయిన  కొంత మంది నిర్వహించిన మీటింగ్ సర్కారు రూల్స్ కు విరుద్ధమని తెలిపారు. గత 10 ఏళ్ల నుంచి టీజీవో లో మెంబర్ షిప్ కూడా చేయలేదని, శ్రీనివాస్ రెడ్డి తాబేదారులైన రిటైర్డ్  అధికారులను ఎన్నికల  అధికారులుగా  నియమించడం  చెల్లదని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం అసోసియేషన్ బైలాస్ కు విరుద్ధమని పేర్కొన్నారు.