ప్రిన్సిపాల్స్ కు గ్రేడ్ వన్ ప్రొసీడింగ్ ఇవ్వండి..మైనారిటీ గురుకుల సెక్రటరీ షఫీ ఉల్లాకు టీజీపీఏ వినతి

ప్రిన్సిపాల్స్ కు గ్రేడ్ వన్ ప్రొసీడింగ్ ఇవ్వండి..మైనారిటీ గురుకుల సెక్రటరీ షఫీ ఉల్లాకు టీజీపీఏ వినతి

హైదరాబాద్, వెలుగు: మైనారిటీ గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్స్​కు గ్రేడ్ వన్ ప్రొసీడింగ్ ఇవ్వాలని టీజీపీఏ అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్ కుమార్, తుమ్మి దిలీప్ కుమార్ ఆ శాఖ సెక్రటరీ షఫీ ఉల్లాకు వినతిపత్రం అందజేశారు. 

బుధవారం మైనారిటీ గురుకుల సొసైటీ కార్యాలయంలో సెక్రటరీని కలిసి గురుకుల ప్రిన్సిపాల్స్ ఎదుర్కొంటున్న సమస్యలతో సహా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రీజనల్ లెవెల్ కో ఆర్డినేటర్ పోస్టులను ప్రమోషన్ పోస్టుగా గుర్తించాలని సెక్రటరీని కోరారు.