పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సదస్సుకు రండి..ఉప రాష్ట్రపతికి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆహ్వానం

పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సదస్సుకు రండి..ఉప రాష్ట్రపతికి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆహ్వానం

 న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది డిసెంబర్ 19, 20 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సదస్సుకు హాజరు కావాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను ఆయన నివాసంలో కలిశారు. 

ఈ సందర్భంగా సదస్సు ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే, ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకత, సామర్థ్యం, వేగాన్ని పెంచే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణలు, ఆవిష్కరణలను ఉప రాష్ట్రపతికి చైర్మన్ వివరించారు.